Author name: Team Vaddepally

సిఐ నర్సింగ్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కూకట్ పల్లి పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణలో నిత్యం అలుపెరగకుండా శ్రమిస్తూ, పోలీస్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచిన సిఐ నర్సింగ్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్బంగా నర్సింగ్ రావును కలిసి శాలువా తో సత్కరించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొంటూ పోలీస్ ఉద్యోగానికి మరింత వన్నె తేవాలని ఆకాంక్షిస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం, #VaddepallyRajeshwarrao #bjpkukatpally#Kukatpally

కేబీకే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం

కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల కోసం కేబీకే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాను. రెండో రోజు(ఏప్రిల్ 6), రూప కిరాణా స్టోర్ సెంటర్, దయార్ గూడ, కూకట్ పల్లిలో, ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్థానికులు అందరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు #VaddepallyRajeshwarrao #bjpkukatpally#KBKhospital#freehealthcheckup#freehealthcamp#Kukatpally

అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం కూకట్ పల్లి పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో కొలువైన అయ్యప్ప ఆలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలశ పూజలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. మణికంఠుడి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నాం. ఈ పూజలకు హాజరైన భక్తుల కోసం దేవస్థాన కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలపై ఆ అయ్యప్ప …

అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు Read More »

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది

అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగి.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు, దళిత జనోద్ధరణకు అవిరళ కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్. ఆయన జయంతి సందర్భంగా కూకట్ పల్లిలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. స్వాతంత్య్రోద్యమ నేతగా, సంస్కరణల వాదిగా, దళితుల ఉద్ధరణకు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అనిర్వచనీయం. స్వాతంత్య్రానంతరం దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం.. రాజకీయ, సామాజిక, చారిత్రక …

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది Read More »

అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా మూసాపేట్ 117 డివిజన్ లో నిరసన కార్యక్రమం చేపట్టాం. బండి సంజయ్ గారి అరెస్టును వ్యతిరేకిస్తూ కేసీఆర్ దిష్టి బొమ్మం దహనం చేయడం జరిగింది. బీజేపీ నాయకులు పట్ల బీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. ప్రభుత్వం తప్పులు చేస్తూ, వాటిని ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య. అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేదు. అతి త్వరలో కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. …

అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరు Read More »

బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని కూకట్ పల్లి బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులును అరెస్టు చేయడం దుర్మార్గం. ఇదీ కేసీఆర్ ప్రభుత్వపు అహంకారపు చర్య. టీఎస్పీఎస్సీ, టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇలా బీజేపీ నాయకుల అరెస్టులకు పాల్పడుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ …

బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం Read More »

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం కేబీకే హాస్పిటల్ సౌజన్యంతో నేటి నుంచి వరుసగా 30 రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాను. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మొదటి రోజు ఏవీబీ పురం పరిధిలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్ ని కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్ 5 నుంచి మే 5 వరకు …

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి Read More »

మూసాపేట్ లోనే వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

మూసాపేట్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు మరియు వారి కుమారుడు తూము వినయ్ కుమార్ గార్లను ఈరోజు మూసాపేట్ లోనే వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. (కూకట్ పల్లి సీనియర్ బీజేపీ నాయకులు) #vaddepallyrajeshwarrao#BJPkukatpally#BJPTelangana

Scroll to Top