Free Health Camp 3rd day

ప్రస్తుతం ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో చాలా మంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది ఏమాత్రం సరికాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు ముందు మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఖర్చులు భారమవతున్న ఈ కాలంలో పేదవారికి కూడా ఎంతో కొంత సహాయపడాలనే సంకల్పంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులు పాటు కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మరియు జేసీఐ సూపర్ హైదరాబాద్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నాను. అందులో భాగంగా మూడో రోజు ఏప్రిల్ 7న బాలనగర్, రాజీవ్ గాంధీ నగర్ హెల్త్ క్యాంప్ లో నిర్వహించిన హెల్త్ క్యాంప్ ని సందర్శించింది. ఈ క్యాంప్ ని స్థానికులు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ 30 రోజుల శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. షుగర్ సంబంధిత వ్యాధులైన గ్యాంగ్రిన్, ఫుట్ అల్సర్లు, సెల్యూలైటిస్ లకు కాళ్లు చేతులు కొట్టేయకుండా మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్న కేబీకే హాస్పిటల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను.
ఈ శిబిరంలో నాతోపాటు కూకట్ పల్లి అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ కల్పన, రమేష్, శ్రీనివాస్ గౌడ్, దిలీప్, శంకర్ చౌదరి, శంకర్ రెడ్డి, మహేష్, ఈశ్వర్, దుర్గారావు, ప్రశాంత రావు, సోనా సింగ్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
#vaddepallyrajeshwarraro #vrrforkukatpally #bjpkukatpally #kbkhospital #HEALTH #CHECKUP #freehealthcamp #freehealthcheckup #kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top