సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ – 2023 కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామ్రాట్ విక్రమాదిత్య పోస్టర్ ప్రారంభించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హెచ్.ఎం.టి మైదానంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు సామ్రాట్ విక్రమాదిత్య నాటక ప్రదర్శనను కార్యక్రమం సందర్భంగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావ్ గారితో కలిసి మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించిన రాష్ట్ర నాయకులు పాప రావు గారు, మల్లారెడ్డి గారు,జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ హరీష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు. అనంతరం సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ని జయప్రదం చేయాలని రాజా విక్రమాదిత్య గొప్ప తనాన్ని చాటి చెప్పేందుకు ‘ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.