కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి భవానీ నగర్ లో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద స్వామి ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రాజేశ్వర్ రావుకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.