రాజేశ్వర్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన 50 మంది యువకులు

కూకట్ పల్లిలో వేగంగా పుంజుకుంటున్న బీజేపీ: వడ్డేపల్లి
– రాజేశ్వర్ రావు సమక్షంలో పార్టీలో చేరిన 50 మంది యువకులు
– కాషాయం కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ సీనియర్ నాయకులు

కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు సమక్షంలో బీజేవైఎం నాయకులు నరేందర్ రెడ్డి, అరవింద్ కిశోర్ నాయుడు, బీజేవైఎం ప్రెసిడెంట్ హుస్సేన్ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి. 7వ ఫేజ్ 117వ డివిజన్ కు చెందిన 50 మంది యువకులు మంగళవారం బీజేపీలో చేరారు. వడ్డేపల్లి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన యువకులకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజేశ్వర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన యువత బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా కూకట్ పల్లిలో బీజేపీ వేగంగా పుంజుకుంటోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూకట్ పల్లితోపాటు రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వి ప్రశాంత్, సిహెచ్ సాయి, వి బిట్టు, మహేష్, పి అఖిల్, జోయల్, బాలాజీ, రాజు, రామకృష్ణ, రాము, కౌశల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top