- బీజేపీ ఎంపీ అరవింద్ తో కలిసి రవి కుమార్ తో కేక్ కట్ చేయించిన రాజేశ్వర్ రావు
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధావారం మసీదు బండలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవి కుమార్ ఆహ్వానం మేరకు కూకట్ పల్లి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి, రవి కుమార్ యాదవ్ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ బీజేపీ యువనాయకుడు రవి కుమార్ యాదవ్ నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి, భవిష్యత్తులో కీలక పదవులు చెపట్టాలని అభిలషించారు. అనంతరం వడ్డేపల్లిని రవి కుమార్ యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్తకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రవి కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.