దివార్ లిఖన్ అభియాన్ (గోడరత అభియాన్) కార్యక్రమంలో భాగంగా, ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గ పాలక్ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా గాంధీ పురం బస్తీలో జరిగిన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా విచ్చేసి డివిజన్ లో పలుచోట్ల మరోసారి మోడీ సర్కార్ తెలంగాణలో ఈసారి బిజెపి ప్రభుత్వం అంటూ కమలం పువ్వు గుర్తుతో వాల్ రైటింగ్ పెయింట్ చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి గారితో పాటు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొన్నారు. అనంతరం విజయశాంతి గారు ఇందిరాగాంధీ పురం బస్తీలోని వీధుల్లో మరోసారి మోదీ బిజెపి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర స్థానిక బస్తీ నాయకులను, బిజెపి కార్యకర్తలను కలుసుకుంటూ అందరిని ఆత్మీయంగా పలకరించడం జరిగింది,అనంతరం వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు మాట్లాడుతూ ఈరోజు మన నియోజకవర్గ పాలక్ విజయశాంతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పని చేసి కూకట్ పల్లిలో ఈసారి బిజెపిని గెలిపించుకోవాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, ఫతేనగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.