బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని కూకట్ పల్లి బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులును అరెస్టు చేయడం దుర్మార్గం. ఇదీ కేసీఆర్ ప్రభుత్వపు అహంకారపు చర్య. టీఎస్పీఎస్సీ, టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇలా బీజేపీ నాయకుల అరెస్టులకు పాల్పడుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ చేతగాని తనాన్ని బయటపెడతారనే భయంతోనే ఈ అక్రమ అరెస్టుకు పాల్పడుతోంది. అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోంది. బండి సంజయ్ గారి మరియు బీజేపీ నేతల అరెస్టుకు నిరసనగా కూకట్ పల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అరెస్టయిన బీజేపీ నేతలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరసనపల్లి సూర్యా రావు, సీనియర్ నాయకులు నాయినేని సూర్య ప్రకాశ్, శంకర్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మహిళా నాయకులు స్వరూప, క్రిష్ణ ప్రియ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు