భారత్ మాతా కీ జై
కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి విలేజ్ లోని శక్తి కేంద్రం ఇంఛార్జి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజా గోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ కి మెదక్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యురాలు,భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు ముఖ్య అతిదులుగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారు మాట్లాడుతూ……. బిఆర్ఎస్ నిరంకుశ పాలన మరియు కెసిఆర్ నియంతృత్వ ధోరణిని ఎండగడుతూ కెసిఆర్ తెలంగాణ వాదాన్ని నమ్ముకుని తాను తన కుటుంబం సంపాదించుకున్న ఆస్తులు గురించి నిలదీయడం జరిగింది. కాపలా కుక్కలాగా ఉంటా అన్న కేసీఆర్ నేడు తన కుటుంబాన్ని మొత్తం రాజకీయాల్లోకి దించి తెలంగాణని ఒక పిచ్చి తుగ్లక్ ఎలాగైతే పాలించాడో అలా కుటుంబ పాలనలో సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయినేని సూర్య ప్రకాష్ రావు గారు,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావు,తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరి కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, భూత అధ్యక్షులు శంకర్ రెడ్డి,భాస్కర్,కార్తిక్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రంజాన్ పద్మ గారు యంజాలా పద్మయ్య గారు, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, మహిళా మోర్చా నాయకురాలు వెంకట లక్ష్మి,కృష్ణ ప్రియ,సీనియర్ నాయకుడు విక్కి,యువ మోర్చా డివిజన్ ఉపాధ్యక్షుడు ధార సాయి,చక్రవర్తి తదితర సీనియర్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 13వ బూత్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, విక్కీ,మాధవరం పాండు, సంతోష్,దారాసాయి తదితరులు పాల్గొన్నారు