పలువురు యువకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు.

బిజెపి పార్టీ తోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని, పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు యువత బిజెపి పార్టీలో చేరుతున్నారని బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన నివాసంలో నరేందర్ రెడ్డి, అరవింద్ నాయుడు,కశ్యప్ యాదవ్ ఆధ్వర్యంలో జయంత్ తో పాటు పలువురు యువకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారి నిర్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి బిజెపి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పేపర్ లీకేజీలు చేసి విద్యార్థులకు జీవితాలతో చెలగాటమడుతుందన్నారు. అరాచకాలను సృష్టిస్తూ అక్రమంగా బిజెపి నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీలో చేరినవారు చిన్ను, సాయి, అఖిల్, కిషోర్, పెద్దిరాజు, ఫైజాన్ తదితరులు ఉన్నారు
#vaddepallyrajeshwarraro #bjpkukatpally #kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top