నూతన వధూవరులను (కీర్తి వివాహం అనిల్ కుమార్) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన బిరదర్ సిద్దు-సునీత దంపతుల ప్రథమ కుమార్తె కీర్తి వివాహం అనిల్ కుమార్ తో శుక్రవారం మూసాపేట్ లోని సీతారామ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. వధువు తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ వివాహ వేడుకకు బీజేపీ మేడ్చెల్ అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. వివాహానంతరం నూతన వధూవరులు కీర్తి-అనిల్ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అక్షింతలు వేసి వారి వివాహ బంధం జీవితాంతం అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top