కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ కు చెందిన జిల్లా రాజు అనిత ల కుమార్తె వివాహం బుధవారం ఎన్ఆర్సీ గార్డెన్ లో జరిగింది. ఈ వివాహానికి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులు మధునిక – కృష్ణలను ఆశీర్వదించి, వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారి వివాహబంధం సుఖశాంతులతో కొనసాగాలని దీవించారు.