ఘనంగా కూకట్పల్లి బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు

కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానంద నగర్ లో గల చిత్తారమ్మ దేవాలయం ప్రాంగణంలో జరిగిన జన్మదిన వేడుకలకు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అడ్వైజర్ కమిటీ సభ్యులు బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు బిజెపి ఇన్చార్జి మాధవరం కాంతారావును గజమాలతో సత్కరించారు. అనంతరం శాలువా కప్పి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాధవరం కాంతారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా వడ్డేపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top