కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిబాపూలే 197’వ జయంతి వేడుక లో పాల్గొని నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిబాపూలే 197’వ జయంతి వేడుక లో పాల్గొని నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

మహాత్మ జ్యోతిబాపూలే గారి 197’వ జయంతి సందర్భంగా, ఈరోజు కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు అనంత నాగరాజు మరియు ఓ.బీ.సీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ గార్ల అధ్యక్షతన పులేగారి జన్మదిన వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్షణపల్లి సూర్యారావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని,పులే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త, మహిళల యొక్క హక్కుల కోసం మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు, ప్రతి ఒక్కరి చదువు కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిబాపూలే అని చెప్పారు, అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా, ఆదర్శవంతంగా ఉన్న వ్యక్తి జ్యోతిబాపూలే అని తెలియజేశారు. జ్యోతిబాపూలే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఏమాత్రం బెదరకుండా దృఢ సంకల్పంతో తన యొక్క విద్యను పూర్తి చేసి, సమాజం కోసం పనిచేస్తూ అణగారిన వర్గాల వెన్నంటూ ఉంటూ వారి యొక్క గెలుపులో తోడుంటూ వారికోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుడు జ్యోతిబాపూలే అని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు నాయినేని సూర్యప్రకాష్ రావు, బిజెపి సీనియర్ నాయకులు నాయినేని పద్మారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, యంజాల పద్మయ,చౌదరి ధర్మారావు,రాష్ట్ర ఓబిసి మోర్చా నాయకులు చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ , డివిజన్ నాయకులు ఈరంటి సాయికుమార్, చెరుకూరి మహేష్, జంగంపల్లి సాయి, కట్ట శంకర్ రెడ్డి, కృష్ణప్రియ, రాఘవేందర్, రమణారెడ్డి, శ్రీధర్ ,అఖిల్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top