మన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర, ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కార్యాలయం ద్వారా ప్రతి రోజూ అందుబాటులో ఉంటూ, నియోజవర్గ ప్రజల సమస్యలు వింటూ పోరాటానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు అందరూ ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పేరుపేరునా ఆహ్వానిస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.