కబీర్ నగర్ లో ఆలయ ఉత్సవాలకు ఆహ్వానం అందుకున్న వడ్డేపల్లి

కబీర్ నగర్ లో ఆలయ ఉత్సవాలకు ఆహ్వానం అందుకున్న వడ్డేపల్లి

  • మోతీ నగర్ లో శివ రామాంజనేయ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు

మోతీ నగర్ పరిధిలోని కబీర్ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ శివ రామాంజనేయ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవం ఈ నెల 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ ఉత్సవాలకు పాల్గొనాలని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు వీలు చూసుకొని ఆలయం ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని రాజేశ్వర్ హామీ ఇచ్చారు. వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జీఎస్ రాఘవేంద్ర, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top