మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన ఏవీఎన్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, పన్నాల హరీశ్ రెడ్డి, ఇతర శ్రేణులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వడ్డేపల్లి మాట్లాడుతూ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.