ఊయల మహోత్సవానికి హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి

కూకట్ పల్లికి చెందిన శ్రీరామోజు భాస్కర్ రావు-విజయలక్ష్మిల మనవరాలి డోలారోహణ మహోత్సవం (ఊయలలో వేసే వేడుక) కేపీహెచ్బీ లోని హోటల్ మొగల్స్ పారడైజ్ లో గురువారం వైభవంగా జరిగింది. వారి ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు శ్రీకాంత్-స్వాతి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ చిన్నారి కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి వెంట పలువురు బీజేపీ నాయకులు హాజరై ఆ చిన్నారికి దీవెనలు అందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top