ఉదాసీన్ మఠం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

  • మఠంలో భూమి పూజ కార్యక్రమానికి హాజరైన రాజేశ్వర్ రావు
  • బీజేపీ నేతకు ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు
    కూకట్ పల్లిలోని శ్రీ ఉదాసీన్ మఠానికి చెందిన సుమారు 540 ఎకరాల భూమిలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు 60 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదాసీన్ మఠం చైర్మన్ శ్రీ రఘు మునిజీ మరియు మఠం ప్రతినిధి రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు చివరి రోజైన శుక్రవారం నాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మఠంలో నిర్వహించిన సుదర్శన హోమం, పూర్ణాహుతి, భూమి పూజను తిలకించారు. అనంతరం వేద పండితులు, మహాస్వామిజీల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవ్వాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనోవికాసంతోపాటు మోక్షం లభిస్తుందన్నారు. ఉదాసీన్ మఠంలో నెలకొల్పనున్న ఈ క్షేత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతూ కూకట్ పల్లి ప్రాంతంలో నగరంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రగా విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు వెంట పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top