శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీహిల్స్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యులు విజయశాంతి మరియు ఉపాధ్యాయులు సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు……….
ఈరోజు జూబ్లీహిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి గారి ఆహ్వాన మేరకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న *మెదక్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులను విజయశాంతి గారు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు * గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి లక్ష్మి గారు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారికి మరియు విజయశాంతి గారినీ మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పి గౌరవించడం జరిగింది.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ……….. తిరుపతిలోని శ్రీవారి ఆలయం మాదిరిగానే టీటీడీ వారు నిర్మించిన ఈ ఆలయం జంటనగరాలలోనే కాకుండా యావత్ తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని తెలియజేస్తూ, భాగ్యనగరంలోని ప్రజలు ఆధ్యాత్మికంతో అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవలో ఉంటారని తెలియజేస్తూ, బ్రహ్మోత్సవాలు పాల్గొన్న భక్తులకు ఆ స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మెన్ శ్రీ కోమటిరెడ్డి లక్ష్మి గారు మాట్లాడుతూ…….. ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న విజయశాంతి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు రావడం ఎంతో ఆనందకరమైన విషయమని తెలియజేస్తూ, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ఒక మంచి ఆధ్యాత్మిక దృక్పథమైన వ్యక్తి అని తెలియజేస్తూ, గతంలో ఈ ఆలయం లోని వెంకటేశ్వర స్వామివారికి బంగారు కిరీటం చేయించి స్వామివారి పట్ల తన భక్తిని చాటుకునారని తెలియచేస్తూ,భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి లాంటి నాయకుడు గెలిస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని తెలియజేశారు.