బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా మూసాపేట్ 117 డివిజన్ లో నిరసన కార్యక్రమం చేపట్టాం. బండి సంజయ్ గారి అరెస్టును వ్యతిరేకిస్తూ కేసీఆర్ దిష్టి బొమ్మం దహనం చేయడం జరిగింది. బీజేపీ నాయకులు పట్ల బీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. ప్రభుత్వం తప్పులు చేస్తూ, వాటిని ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య. అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేదు. అతి త్వరలో కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పటికైనా తమ తప్పులను సరిచేసుకొని బండి సంజయ్ గారిని, బీజేపీ నాయకులను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో నాతోపాటు కూకట్ పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్, డివిజన్ అధ్యక్షులు మనోహర్, తూము శైలేష్, వినోద్ కుమార్, మంగమ్మ, ఈ సాయి ప్రసాద్, శివరాజ్ యాదవ్ తిరుపతి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, లక్ష్మి, స్వరూప, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.