- భజరంగ్ దళ్ పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు కూకట్ పల్లి బీజేపీ నిరసన
- బీజేపీ కార్యాలయంలో హనుమాన్ ఛాలిసా పఠించిన నేతలు
- కర్నాటక ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరిన రాజేశ్వర్ రావు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై కూకట్ పల్లి బీజేపీ తరఫున అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, బీజేపీ రాష్ట్రవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావుతో కలిసి పాల్గొన్నారు. భజరంగ్ దళ్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్లకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు హనుమాన్ చాలిసా పఠించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భజరంగ్ దళ్ పై చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అని విమర్శించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల మంది కొలిచే ఆంజనేయస్వామి భక్తులను కించపరిచే విధంగా కాంగ్రెస్ కామెంట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీకి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని వ్యాఖ్యానించారు. కర్నాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ తమ ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, ఈ సాయి ప్రసాద్, దుర్గారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.