కూకట్ పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 రోజుల ఉచిత వైద్య శిబిరాలు నేటికి 7వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా గురువారం కూకట్ పల్లి రామాలయం వద్ద ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని సందర్శించి, వైద్యులతో మాట్లాడటం జరిగింది. స్థానికంగా హాజరయ్యే పేషెంట్లు, కాలనీ వాసలకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాను. కూకట్ పల్లి నియోజకవర్గ వాసులంతా ఈ 30 రోజుల ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం