టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు సోమవారం కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నా. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పేపర్ లీకేజీ జరిగింది. గ్రూప్ 1, ఏఈ లాంటి పరీక్షల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇది చాలా హేయమైన చర్య. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను లిక్కర్ రాజ్యంగా మారుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతసేపూ ఢిల్లీ లిక్కర్ దందాలో భాగమైన తన కూతురిని ఎలా కాపాడుకోవాలనే ఆలోచిస్తున్నారు. అంతేతప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. పేపర్ లీకేజీ వ్యవహారం పై సమాధానాలు చెప్పకుండా ఎమ్మెల్సీ కవిత కోసం రాష్ట్ర మంత్రులను ఢిల్లికి పంపారంటే నిరుద్యోగుల జీవితాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చులకనో అర్థమవుతోంది. టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీకి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పేపర్ లీకేజీకి పాల్పడ్డ వారిపై కఠినంగా శిక్షించాలి. దీని వెనక ఇంకా ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నాలో కూకట్ పల్లి బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు, హరీశ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.