భారత్ మాతాకీ జై
ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం 120 బాలనగర్ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు G. రమేష్ గారి అధ్యక్షతన డివిజన్ ఇంచార్జ్ యంజాల పద్మయ్య గారి సమక్షంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ……. డివిజన్ లోని ప్రతి కార్యకర్త పార్టీ ఎదుగుదల కోసం కష్టపడాలని, అలాగే రానున్న రోజుల్లో అసెంబ్లీ పరంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నందున మరింత కష్టపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో చూపించి కూకట్పల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జండా ఎగురవేయడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శులు A.లక్ష్మణ్ మరియు వెంకట చిన్నారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి S.K.శ్రీనివాస్,జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కూతురి రమేష్,సుందర్ రెడ్డి, లక్ష్మణ్,శ్రీశైలం,బక్క రెడ్డి ఇంద్రసేన,మహేష్,కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.