హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూకట్పల్లి అసెంబ్లీ(బూత్ నెంబర్ 102) కి సంబంధించిన పచ్చీసు ప్రబారిల సమీక్షా సమావేశం కూకట్పల్లి MLC ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పార్టీ ఆఫిస్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలు గా కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మాధవరామ్ కాంతారావు గారు, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు విచ్చేశారు, వాళ్ళిద్దరూ మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమందరం కలిసి కష్టపడి బిజెపి బలపరిచిన అభ్యర్థి AVN రెడ్డి గారిని గెలిపిస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారం లో రావడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని కోరారు. ఈ సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీజిల్లా ఇంచార్జ్ నరేందర్ రెడ్డి గారు, సూర్య ప్రకాష్ రావు గారు, కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు గారు, ధర్మ రావు గారు, ప్రీతం రెడ్డి గారు, రామ్మోహన్, మరియు పచ్చీస్ ప్రభారులు పాల్గొన్నారు.