భారత్ మాతాకీ జై
కూకట్పల్లి నియోజకవర్గం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు అంగరంగ వైభవంగా హోలీ పండగ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు
ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోలీ పండుగ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది.
వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయినేని సూర్య ప్రకాష్ రావు గారికి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావు గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాదారం కాంతారావు గారికి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు గారికి,నియోజకవర్గ మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన గారికి మరియు ఉత్సవాల్లో పాల్గొన్న యువతకి హోలీ పండుగ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.