భారత్ మాతాకీ జై
25 సంవత్సరాల విజయశాంతి గారి రాజకీయ జీవితం ఎంతోమందికి ఆదర్శవంతం : వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు
కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కూకట్పల్లి అసెంబ్లీ పాలక్, మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి విజయశాంతి గారి రాజకీయ ప్రయాణం నేటితో 25 సంవత్సరాలు పూర్తివడంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కూకట్పల్లి నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు తన అభిమానులతో శ్రీమతి విజయశాంతి గారి నివాసానికి భారీ ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి అనుచరులు విజయశాంతి గారిచేత 25 కిలోల కేకును తీసుకెళ్లి కట్ చేయించి భారీ గజమాలతో విజయశాంతి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ…….. “ఒక సినీ నటిగా, ఉద్యమకారినిగా,రాజకీయ నాయకురాలుగా తన జీవితం లక్షలాదిమంది ఆడపడుచులకు మరియు ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తన రాజకీయ ప్రయాణం నేటి యువతరానికి ఉండాల్సిన క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు.కూకట్పల్లి నియోజకవర్గ పాలక్ గా విజయశాంతి గారి సహకారంతో భారతీయ జనతా పార్టీని కూకట్పల్లిలో అగ్రస్థనానికి తీసుకువెళ్లే నాయకుడిగా ఎప్పుడూ ముందుంటానని అన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకురాలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.