తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును ఆయన నివాసంలో బుధవారం సిద్ధిపేట్ జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు సుంకరి శ్రీధర్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు.
టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు సిద్దిపేట జిల్లా వాసులకు పెద్ద ఎత్తున తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనాలు చేయిస్తున్నందుకు శ్రీధర్ గౌడ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు స్వామి వారి దర్శనం, వసతి సౌకర్యాల ఏర్పాటులో సహాయ సహకారాలు అందిస్తున్న వడ్డేపల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సిద్ధిపేట జిల్లావాసులు, ఎంపీటీసీల ఫోరం తరఫున వడ్డేపల్లి రాజేశ్వర్ రావును శ్రీధర్ గౌడ్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రాజు, అజయ్, శేఖర్ పాల్గొన్నారు.