పాఠశాలల్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలు ద్వారా విద్యార్థుల్లో దాగివున్న మేధా శక్తి పెరగడంతో పాటుగా వారిలో దాగివున్న ప్రతిభ కనబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారులు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ కూకట్ పల్లి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు .
మంగళవారం కూకట్ పల్లి డివిజన్ లోని పాపిరెడ్డినగర్ లోగల రాజధాని హై స్కూల్లో నిర్వహించిన నేషనల్ మెగా ఆర్ట్ అండ్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండంట్ యాద నరేందర్ తో కలిసి వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన లను తిలకించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాద రేణుక, , బీజేపీ నేతలు భూపాల్ రెడ్డి,బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అక్కినపల్లి సాయికుమార్,సీనియర్ నాయకులు అల్లాపురం గోపాలరావు గారు,గంగుల రాజిరెడ్డి,ఇన్నారెడ్డి ,ఆర్యవైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎల్లకొండ జయకుమార్ గుప్త లతో పాటుగా పిటి ఉదయ్ కుమార్ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.