కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త లత గారి భర్త పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఈ విషయాన్ని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రమేష్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వడ్డేపల్లి వెంటనే స్పందించి లత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తదుపరి కార్యక్రమాల నిర్వహణ కోసం లతకు ఆర్థిక సాయం అందించారు. మధు కుటుంబానికి స్థానిక బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.