ధ్వజ స్తంభం చేయించిన దాత తూము మనోజ్ కుమార్
ఆలయంలో రాజేశ్వర్ రావు ప్రత్యేక పూజలు
కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ అంజన్న నగర్ లో పాపనాశి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం శివ పార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. గుడి పునరుద్ధణ కోసం వడ్డేపల్లి నాగ దేవత విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించి, ఆలయానికి బహూకరించారు. అదే విధంగా ఆలయానికి ధ్వజ స్తంభం చేయించిన దాత తుమ్ము మనోజ్ కుమార్ కు రాజేశ్వర్ రావు అభినందనలు తెలియజేశారు.
అనంతరం వడ్డేపల్లి రాజేశ్వర్ రావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రాజేశ్వర్ రావు ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన, తర్వాత శివ పార్వతుల కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలో కార్యక్రమాలు, ఏర్పాట్లపై ఆలయ కమిటీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాల్లో వడ్డేపల్లితోపాటు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, సప్పిడి జగన్, సప్పిడి శ్రీను, సప్పిడి వినోద్ కుమార్, మనోజ్, నోముల వెంకటేష్, తూము శైలేష్, తూము మనోజ్, దర్శన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.