కూకట్ పల్లి కి చెందిన ఆదిముల్ల రాము మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కుచారం ఇండస్ట్రీయల్ పార్క్ లో ప్లాస్టిక్ వస్తువుల తయారీ కోసం డీఎల్ ఇండస్ట్రీస్ అనే నూతన వ్యాపారాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యారు. ఫ్యాక్టరీ అంతా కలియ తిరిగి, మెషినరీని పరిశీలించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి మాట్లాడుతూ నూతన ఫ్యాక్టరీ ప్రారంభించిన రాముకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎల్ ఇండస్ట్రీస్ వ్యాపారం లాభసాటిగా జరగాలని ఆకాంక్షించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా నాణ్యమైన ప్లాస్టిక్ వస్తు సామగ్రిని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.