- వీఎన్ఆర్ ట్రస్టు ద్వారా సుకన్య సమ్రుద్ధి యోజన పాలసీలు చేయించిన వడ్డేపల్లి
- శనివారం పాలసీదారులకు పాస్ బుక్ ల పంపిణీ
ఆడపిల్లలకు ఆర్థిక చేయూతనివ్వాలనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. కూకట్ పల్ల నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో వీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోస్టల్ ఇండియా ద్వారా పదేళ్లలోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం, 18 ఏళ్లు నిండిన యువకులకు యాక్సిడెంటల్ పాలసీలను తన సొంత ఖర్చుతో చేయించారు. ఈ నేపథ్యంలో శనివారం ఆ పాలసీలకు సంబంధించిన పాస్ బుక్ లు, ఇతర డాక్యుమెంట్లను లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం రాజేశ్వర్ రావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, ఆర్థిక చేయుత కోసం కేంద్రం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాల ప్రయోజనాలను తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు జే రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎడ్ల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శివరంజని, సంధ్య, సంగీత, వాణిశ్రీ నాయుడు, పద్మారావు, లక్ష్మణ్ రావు, పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.