కూకట్ పల్లి నియోజకవర్గంలో 30 రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాల్లో భాగంగా మంగళవారం 5వ రోజు ఫతే నగర్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరానికి స్థానికుల పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు సిఫార్సు చేసిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి రోజు నిర్వహించే ఈ ఫ్రీ హెల్త్ క్యాంపులను ఆయా కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు కు సహకరిస్తున్న కేబీకే హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం