కూకట్ పల్లి నియెజకవర్గ పరిధిలోని మూసాపేట్ 117 డివిజన్ లో బీజేవైఎం అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించారు. ఏవైనా వ్యాధులను ఈ శిబిరాల ద్వారా ప్రారంభంలోనే గుర్తించవచ్చన్నారు. తద్వారా మెరుగైన చికిత్స తీసుకొని వాటి నుంచి బయటపడొచ్చని రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. పేద ప్రజలకోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించిన బీజేవైఎం అధ్యక్షులు, కార్యకర్తలను వడ్డేపల్లి ప్రత్యేకంగా అభినందించారు. ఇలానే మరిన్ని ప్రజా ఉపయోగ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.
ఈ శిబిరంలో బీజేపీ నాయకులు కర్క డాగయ్య, మల్లేష్, వినోద్ కుమార్, ఈ సాయి ప్రసాద్, శేఖర్ గుప్తా, శైలేష్ కుమార్, మంగమ్మ, జానకి రాజేశ్వరి, కృష్ణ యాదవ్, మాణిక్, మహేష్ యాదవ్, బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.