ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు. యావత్ భారత దేశాన్ని ఉర్రూతలూగించిన నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోగిపోతోంది. ఈ పాట ద్వారా తొలిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ప్రతి తెలుగువాడికి, భారతీయులకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు మరోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
- వడ్డేపల్లి రాజేశ్వర్ రావు