కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ లో కొలువైన శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం అనంతరం వేద పండితుల నుంచి స్వామి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేంకటేశుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానించిన ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.