కూకట్ పల్లి లో శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానము 17 వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుంచి 14 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. హనుమజ్జయంతి, పవిత్రోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ.. బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వడ్డేపల్లి నివాసానికి వచ్చి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొంటానని రాజేశ్వర్ రావు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో, కమిటీ ఆధ్వర్యంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.